calender_icon.png 11 September, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమావేశం పేరుతో షుగర్ ఫ్యాక్టరీపై అఖిలపక్షల డ్రామా

11-09-2025 09:06:21 PM

బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజకొండ యాదగిరి బాబు

మెట్ పల్లి (విజయక్రాంతి): ప్రత్యేక సమావేశం పేరుతో షుగర్ ఫ్యాక్టరీపై అఖిలపక్షలు డ్రామాలు చేస్తున్నాయని బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజకొండ యాదగిరి బాబు అన్నారు. గురువారం మెట్ పల్లి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. షుగర్ ఫ్యాక్టరీ పై రౌండ్ టేబుల్ సమావేశం ఒక డ్రామా అని గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిఆర్ఎస్ నేతలు ఎందుకు తెరిపించలేకపోయారని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిపించడంలో ఎందుకు డ్రామాలాడుతుందని అన్నారు. ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో చేసిన కమిటీ ఉత్తదేనా కమిటీ కాలయాపనకేనానని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఎన్నడన్న షుగర్ ఫ్యాక్టరీ గురించి ప్రభుత్వాన్ని నిలదీశారా, కార్మికుల గురించి ఏనాడైనా ఉద్యమాలు చేశార అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ బిఆర్ఎస్ కమ్యూనిస్టులు రైతులను మోసం చేయడం తప్ప ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో చిత్తశుద్ధి లేదని స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఫ్యాక్టరీ పేరుతో ఒక డ్రామా ఆడటం తప్ప చెరుకు రైతులను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి తెరిపించే బాధ్యత ఎంపీ ధర్మపురి అరవింద్ తీసుకుంటారని అన్నారు. రైతుల కోసం కేవలం బిజెపియే ఉద్యమాలు చేస్తుంది, షుగర్ ఫ్యాక్టరీ విషయంలో బిజెపి చేసే పోరాటాలకు మద్దతు తెలుపాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి,నిజామాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివ్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకేటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.