11-09-2025 08:52:43 PM
మండల కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి చింతా చంద్రావతి
మంగపేట (విజయక్రాంతి): వెనుకబడిన తరగతుల వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ హర్షదాయకం అని మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి చింతా చంద్రావతి అన్నారు.ఈ సందర్భంగా చంద్రావతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకి, మంత్రి మండలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.