11-09-2025 08:50:55 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పైకాజినగర్ లో నెల రోజులు తిరగకముందే రెండు మూగజీవాలు మృత్యువాత చెందాయి. కాలనీలో ఖాళీగా ఉన్న ప్లాట్లలో ఎపుగా చెట్లు పెరగడంతో విష పురుగులకు నిలయంగా మారింది. ఆగస్టు 27న ఆవును పాము కుట్టడంతో మృత్యువాత చెందగా గురువారం మరో మూగజీవి బలి అయింది. ఖాళీగా ఉన్న ప్లాట్లు చెట్లను తొలగించాల్సిన యజమాన్యాలు పట్టించుకోకపోవడంతో చెట్లు పెరగడంతో పశుగ్రాస కోసం మూగజీవాలు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నాయి. చెట్లలో ఉన్న విష పురుగులు మూగజీవాల పాలిట శాపంగా మారాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.