calender_icon.png 11 September, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలయ పన్ను బకాయిలను త్వరగా చెల్లించాలి

11-09-2025 08:30:05 PM

జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు

గద్వాల: జిల్లాలో గ్రంథాలయ పన్ను బకాయిలను త్వరగా చెల్లించాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు(District Additional Collector Narasinga Rao) అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ తమ ఛాంబర్ నందు గ్రంథాలయ పన్ను వసూలుపై సంబందించిన అధికారులతో సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రంథాలయ సంస్థ జోగులాంబ గద్వాల జిల్లాకు గ్రంథాలయ పన్ను, 8 శాతం (ఆస్తి పన్నుపై) వివిధ గ్రామపంచాయతీల నుంచి, మున్సిపాలిటీల నుంచి రావాల్సిన గ్రంథాలయ పన్ను బకాయిలను త్వరగా చెల్లించాలని మున్సిపాలిటీ కమిషనర్లకు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, జిల్లా ఆడిట్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపాలిటీ కమిషనర్లు, కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ, తదితరులు పాల్గొన్నారు.