11-09-2025 08:36:36 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): గ్రూప్ 1 పరీక్ష నిర్వహణంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్(Public Service Commission) విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ టి జి పి ఎస్ పి చైర్మన్, సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనలో భాగంగా శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేటు దగర నిరుద్యోగ విద్యార్థులతో కలిసి పోలీస్ ల నిర్బంధం మధ్య ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా కరీంనగర్ జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడిగే వారిని అరెస్టులు చేయడం కాదు గ్రూప్ -1 పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,జీవో నెం 29 రద్దు చేయాలి జీవో నెం 55 ఇంప్లీమెంటేషన్ చేయాలని, గ్రూప్ -1పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేనియడల ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదు గ్రూప్ -1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు బి ఆర్ ఎస్ వి పోరాటం చేయక తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ వి శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ , నగర బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు బొంకూరి మోహన్ , బి ఆర్ ఎస్ వి యూత్ కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షులు గంగాధర చందు,రాష్ట్ర నాయకులు బందారపు అజయ్ కుమార్ గౌడ్ , ఆరే రవి గౌడ్, నారదాసు వసంత రావు, పటేల్ శ్రవణ్ రెడ్డి , సోమిరెడ్డి నరేష్ రెడ్డి, ఒడ్నాల రాజు, అఫ్రోజ్ , అవినాష్ , సోహెల్,సైఫ్ ,ప్రశాంత్ , పదం సిద్దు , లింగాల సాయి కిరణ్ , ఉప్పు మనోజ్ , శ్యామ్ , అక్షయ్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.