11-09-2025 08:59:04 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్, డి.పి.ఆర్.ఓ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు రైతు భరోసా, పరిసరాల పరిశుభ్రత, డ్రగ్స్, ప్రభుత్వం అందిస్తున్న ఇస్తున్న సన్నబియ్యం ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పై ప్రజలను చైతన్యపరిచేందుకు గురువారం సాయంత్రం తెలంగాణ సాంస్కృతిక సారథి కొప్పర్తి సురేందర్ కళాజాత టీం-2 చే అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం మైక్ సెట్ అందించిన టీ ఎస్ ఎస్ చైర్ పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వావిలాల నాగలక్ష్మి, గొల్లపెల్లి శిరీష, సల్లూరి కృష్ణయ్య, కొప్పర్తి రవీందర్, కుమ్మరి శ్రావణ్ కుమార్, బీర్పురి శ్రీనివాస్, కాసిపేట సంతోష్, లింగంపల్లి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.