11-09-2025 08:32:49 PM
వాగు దాటుతుండగా వ్యక్తి గల్లంతు..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూర్ మండలం సంగం కలాన్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన రైతు మొగులప్ప ఉదయం పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో ఇంటికి వెళ్లేందుకు గ్రామ శివారులో ఉన్న దిడ్డి వాగును దాటుతుండగా వర్షపు నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. మొగులప్పను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. రైతు మొగులప్ప ఆచూకీ కోసం రెవెన్యూ, పోలీస్ అధికారులు అన్వేషిస్తున్నారు.