calender_icon.png 27 October, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం

27-10-2025 12:29:44 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మినిస్టర్ క్వార్టర్స్ లో( Minister Quarters) కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ఈ కీలక భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహణపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ ఛార్జ్ ని నియమించాలని నిర్ణయించారు. ప్రతి ఓటర్ ను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వేసేలా చేయడంపై సమాలోచనలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.