calender_icon.png 27 October, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధికుక్కల దాడులపై వార్తలొస్తున్నా.. చలనం లేదా?: సుప్రీం కోర్టు ఆగ్రహం

27-10-2025 12:11:15 PM

వీధి కుక్కల దాడుల కేసు.

వీధి కుక్కల స్టెరిలైజేషన్ వ్యవహారంపై సుప్రీకోర్టు ఆగ్రహం.

రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు సమన్లు.

న్యూఢిల్లీ: వీధి కుక్కలకు(Stray dogs case) స్టెరిలైజేషన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 22న ఉత్తర్వులిస్తే.. ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. వీధికుక్కుల దాడులపై రోజూ మీడియాలో వార్థులు వస్తున్నా.. చలనం లేదా అని ప్రశ్నించింది. స్పందించని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు తదుపరి విచారణలో తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇన్ని రోజులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని త్రి సభ్య ధర్మాసనం ప్రశ్నించింది. స్పష్టమైన వివరణ స్వయంగా ఇవ్వాలని సీఎస్ లను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. సీఎస్ లు హాజరుకాకపోతే తదుపరి చర్యలకు ఆదేశిస్తామని జస్టిస్ విక్రమ్ నాథ్ హెచ్చరించారు. వివరణ సంతృప్తికరంగా లేకున్నా.. జరిమానాతో పాటు చర్యలకు ఆదేశిస్తామని జస్టిస్ పేర్కొన్నారు. అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను తాత్సారమేంటని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation of Delhi) మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 కింద రూపొందించబడిన జంతు జనన నియంత్రణ (ABC) నియమాలు, 2023ని అమలు చేయడానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ సమ్మతి అఫిడవిట్‌లను ఎందుకు దాఖలు చేయలేదో వివరించాలని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వీ అంజరియాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సమన్లు ​​జారీ చేసింది.