18-07-2025 12:00:00 AM
బాగ్దాద్, జూలై 17: ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు ఇరాక్‌లోని అల్- కు ట్ సిటీలోని హైపర్ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా సజీవదహనమైనట్టు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం తో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. హైపర్ మార్కెట్‌లోని ఐదు అంతస్తుల భవనంలో రాత్రిపూట మంటలు చెలరేగాయి.
మంటలు చా లా దూరం వరకు వ్యాపించాయి. వె ంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాప క సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన నేపథ్యంలో భవనం, షాపింగ్ మాల్ యజమానిపై పలు కేసులు నమోదయ్యాయి.