calender_icon.png 20 January, 2026 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీలో భారీగా చేరికలు

20-01-2026 12:00:00 AM

కండువా కప్పి ఆహ్వానించిన అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం కొండాపూర్‌కి చెందిన గొనే క్రిష్ణ సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్ గౌడ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర నాయకులు బిక్కు నాయక్, కొమ్రిశెట్టి నర్సింహులు పాల్గొన్నారు. అలాగే  రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,  రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి సుధాగాని హరిశంకర్ గౌడ్ సమక్షంలో ఎల్బీనగర్కు చెందిన సివిల్ ఇంజనీర్, బిల్డర్ పన్నాల అజయ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.