calender_icon.png 20 January, 2026 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

100 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

20-01-2026 12:00:00 AM

కాచవాని సింగారంలో 6.12 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం 

ఘట్‌కేసర్, జనవరి 19 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ పరిధిలోని కాచవాని సింగారంలో రూ.100 కోట్ల విలువైన 6.12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నా రు. కాచవాని సింగారం రెవెన్యూ పరిధిలోని 6 ఎకరాల 12 గుంటల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న విష యం తెలుసుకున్న హైడ్రా అధికారులు.. రం గంలోకి దిగి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపా రు. ఆ భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.