24-12-2025 09:27:50 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవ సర్పంచ్ గా రామిశెట్టి విజయశాంతి అప్పారావు బుధవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. గ్రామ ప్రజలు,వార్డు సభ్యులు కార్యకర్తలు యువత అందరూ ఊరేగింపు గా బయలుదేరి గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ మండల అభివృద్ధి అధికారి, కార్యదర్శి సమక్షంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ పెద్దలను సన్మానించారు.