7 July, 2026 | 1:13 AM

ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి

07-07-2026 12:29 AM
  1. విజయక్రాంతి డైరెక్టర్ విజయరాజం 
  2. కాళేశ్వరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు 

మహాదేవపూర్, జూలై 6 (విజయక్రాంతి): శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, ఆదిముక్తేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని యాదగిరిగుట్ట ఆలయ కమిటీ సభ్యురాలు, విజయక్రాంతి దినపత్రిక డైరెక్టర్ విజయరాజం ఆకాంక్షించారు. సోమవారం ఆమె శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. బాలాలయంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి అభిషేకం, శుభానంద దేవికి కుంకుమార్చన నిర్వహించారు.

అనుబంధ ఆలయమైన ఆది ముక్తేశ్వరస్వామివారికి అభిషే కం చేశారు. అనంతరం విజయరాజం మాట్లాడుతూ.. ఆలయ పునరుద్ధరణ పనులు అనుకున్న సమయంలో పూర్తిచేసి భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఆలయం అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేశారు.