7 July, 2026 | 1:18 AM

హైస్కూల్ పాత భవనాన్ని కూల్చివేయాలి

07-07-2026 12:28 AM

కలెక్టర్‌కు వినతి

ఆత్మకూరు, జూన్ 6: అమరచింతలో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల పాత భవనాన్ని కూల్చివేయాలని వ్యాకాస నాయకులు కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి పత్రం అందజేశారు. గత 50 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన భవనం కావడంతో జూన్ 28న అమరచింతకు చెందిన పగుడాకుల పవన్ కుమార్ అనే విద్యార్థి పాత భవనం కింద కూర్చొని ఉండగా పాత స్కూల్ స్లాబ్ కూలి ఆ విద్యార్థికి ఎడమ కాలుకు తీవ్రగాయం అయింది హాస్పిటల్ లో లక్ష లు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ విద్యార్తి వైద్య ఖర్చుల కు అయ్యే వ్యయం ను ప్రభుత్వ భరించాలని డిమాండ్ చేశారు. ఆ పురాత భవనంను వెంటనే కూల్చివేతకు చర్యలు చేపట్టాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్కూలు ఆవరణలో వాకర్స్ వందలాదిగా వస్తూ పోతూ ఉంటారని ఈ తరుణంలో భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాకాధికారులు స్పందించి పాత పురాతన స్కూల్ బిల్డింగును కూల్చివేసి ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.

ప్రస్తుతం నూతన భవనంలో స్కూలు కొనసాగుతున్నందున ఇక పాత స్కూల్ బిల్డింగ్ వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేశారు గాయపడిన విద్యార్థిని కుటుంబాన్ని ఆర్థికంగా వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఆదుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇదివరకే ప్రభుత్వ అధికారులు విద్యాశాఖ అధికారుల పర్యటన సందర్భంగా అనేకసార్లు ఈ సమస్యపై విన్నవించిన స్పందించకపోవడంతో ఈరోజు ప్రజావాణిలో జిల్లా అధ్యక్షులు అజయ్  మండల అధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.