20-08-2025 12:49:25 AM
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
మిడ్జిల్ ఆగస్టు 19 : దైవ అనుగ్రహం అందరి పై ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఇదమ్మ దేవాలయంలోబోనాల పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ ఎడ్ల శంకర్ తోపాటు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో జీవనం గడపాలని అమ్మవారిని ఆకాంక్షించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పులి రాజు, ఎస్త్స్ర శివ నాగేశ్వర్ నాయుడు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మొహమ్మద్ గౌస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోదా కృష్ణ, నాయకులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.