22 June, 2026 | 1:31 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

దేవీ ఆశీస్సులతో ప్రజలు చల్లగా ఉండాలి

02-10-2025 12:00 AM

సనత్‌నగర్, అక్టోబర్ 1 (విజయక్రాంతి):- దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. దేవీ నవరాత్రులలో భాగంగా బుధవారం ఆమీర్‌పేట డివిజన్‌లోని బాపూనగర్‌లో బస్తీ అధ్యక్షుడు హరిసింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని,  సనత్ నగర్ డివిజన్‌లోని సి టైప్ క్వార్టర్స్ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండ పాన్ని, సాయిబాబానగర్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ఎమ్మెల్యే తలసాని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, డివిజన్ బిఆర్‌ఎస్ అద్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, గోపిలాల్ చౌహాన్, వనం శ్రీనివాస్, కూతు రు నర్సింహ, రాజేష్ ముదిరాజ్, పీయూష్ గుప్త, ఫలహారం బండి మధు, అర్జున్ గౌడ్, సీనియర్ సిటిజన్స్ పార్థసారధి, అనంత రెడ్డి, మానిక్ పాటిల్ ఉన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.