02-10-2025 12:00:00 AM
తీరొక్క మొక్కులు చెల్లించుకుంటున్న భక్తజనం
పాపన్నపేట, అక్టోబర్ 1 :భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇంటి ఇలవేల్పుగా.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసి ద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 10వ రోజు బుధవారం నవమిని పురస్కరించుకొని వనదుర్గామాతను మహిషాసురమర్దిని (సిద్ధిరాత్రి) దేవి రూపంలో, మెరూన్ రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.
ఆలయ అర్చకులు వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి నారింజ రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. అనంతరం సువాసిని పూజ, చండీ హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.నేడు రాజరాజేశ్వరి దేవిగా వనదుర్గమ్మ దర్శనం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజైనా గురువారం వనదుర్గామాత రాజరాజేశ్వరి దేవి రూపం, పసుపు రంగు వస్త్రంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.