వెలుగు దివ్వెలు ముదిరాజులు
తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ కులం ఉనికి బలీయంగా ఉంది. ముదిరాజ్, నాయుడు, నాయక్ అనేవి కులం పేర్లు కాగా ముత్రాశి, ముత్రాచ, ముత్రాజ్, తెలుగోళ్ళు, బంటు, తెనుగ తదితర పేర్లను పర్యాయ పదాలుగా ముదిరాజ్ జాతిని వ్యవహరిస్తారు. 1920లో సిరాజుల్ హసన్ రాసిన ‘నిజాం డొమినియన్- క్యాస్ట్ అండ్ ట్రైబ్స్’ గ్రంథంలో ముత్రాశిలను ముత్రాజ్, మోడ్రజ్, కోలి, నాయక్, తెల్గాండ్, తెన్గాండ్ లేదా తెలగ అని పేర్కొన్నారు. నిజాం రాజ్యంలో వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, వేట, రైతు కూలీలుగా జీవించడం. మరో చరిత్రకారుడు థ్రష్టన్ (1909) తన గ్రంథం ‘క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా’లో యయాతి మహారాజు ముదిరాజ్ వంశీకుడని పేర్కొన్నారు. యయాతికి మోదిరాజ్ అనే మారు పేరు (మోది అనగా ముసలి) ఉండేదని శుక్రాచార్యుని శాపం కారణంగా తన తండ్రి వృద్ధాప్యాన్ని తాను స్వీకరించి, తండ్రిని కాపాడి ‘మోదిరాజ్’ అయ్యారని పేర్కొన్నారు.
ముత్రాజ్ నుంచి ముదిరాజ్ కులం పేరు వచ్చింది. మోదిరాజ్ పదం కాలక్రమంలో మారిపోయి ముత్రాజ్, ముదిరాజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ 1970లో సమర్పించిన నివేదకలో ముదిరాజుల్లో 28 తెగలున్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశంలో నివసించే ముత్రాచలు అనేక తెగలుగా వున్నారని థ్రష్టన్ తన గ్రంథంలో పేర్కొన్నారు. ఆవుల, లిరిగలలు, బుసి, ఎల్లాల్, ఇండ్ల, ఇగుల్, కొప్పుల, నక్కల, నక్కల్, కటారి, మర్రి.. వీటిలో కొన్ని, వీరంతా తెలుగు మాట్లాడతారు. తెలుగు భాషను రాస్తారు.
ముదిరాజ్ ఆచార వ్యవహారాలు
ముదిరాజులు మాంసాహారులు. వరి బియ్యం వీరి ప్రధాన ఆహారం. ముదిరా జ్ కులంలోని పురుషులు మద్యం సేవిస్తారు. ఇంటి పేర్లనుబట్టి వీరు వివాహ సంబంధాలను కుదుర్చుకుంటారు. బురం, త్రిపురాన్, నుతి, చింతల, కంటి నర్సింగు వంటి ఇంటి పేర్లు గల ముదిరా జ్ కుటుంబాలు, ఒకరింటికి మరొకరిని ఇచ్చి పుచ్చుకునే పద్ధతిని పాటించి పెళ్ళి ళ్లు చేసుకుంటారు. మేనరికపు వివాహాలు కూడా వీరు చేసుకుంటారు. ఇక, కట్నకానుకలను డబ్బు రూపేణా, వస్తు రూపే ణా వరకట్నంగా ఇవ్వడం ముదిరాజులు సాంప్రదాయంగా పాటిస్తారు. ఒకవేళ భార్య భర్తకు విడాకులు ఇస్తే భార్యకు భర్త భరణం ఇవ్వవలసి ఉంటుంది.
వితంతు వు, విడాకులు తీసుకున్న వారు పునర్వివాహం చేసుకునే ఆచారం ఉంది. తల్లి దండ్రులు తమ ఆస్తికి కుమారులను మాత్రమే హక్కుదారులుగా పరిగణిస్తారు. ఆడవారికి శ్రీమంతం చేయడం, పురుడు పోయడం వంటి ఉత్సవాలను జరుపుకుంటారు. కన్నెలైన ఆడపిల్లలకు రజస్వల (పెద్దకావడం) కార్యక్రమాన్ని జరపడం ఆనవాయితీగా వస్తోంది. పెళ్ళి సమయంలో పెళ్ళికూతురు మెడలో పెళ్ళి కుమారుడు మంగళసూత్రాన్ని ముడి వేస్తారు. కుటుంబంలో ఎవరైనా మరిణిస్తే వారికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాలలో సమాధి చేస్తారు. మూడవ రోజు చిన్నకర్మ ౧౧వ రోజు పెద్దకర్మ నిర్వహిస్తారు.
కులదైవం పండుగలు ఉత్సవాలు
ముదిరాజులు సాంప్రదాయంగా శైవులు, వైష్ణవులుగా తమలో తామే రెండు మతాచారాలను అవలంబిస్తారు. మల్లేశ్వర, వెంకటేశ్వర, మునేశ్వర, పోమేశ్వర, రంగనాథస్వామి మొదలైన దేవుళ్ళను కొలుస్తారు. గ్రామదేవతలను పూజిస్తారు. హిందూ పండుగలైన ఉగాది, దసరా, సంక్రాంతి, శివరాత్రి, ఏకాదశి, శ్రీరామనవమి, కార్తీకమాసం వంటి పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపు కుంటారు. ముదిరాజులు తమ కుల పూజారులుగా బ్రాహ్మణులను, చాత్తాదులను, జంగమాలను వ్యవహరిస్తారు. పీర్ల పండగలో కూడా వీరు పాల్పం చుకుంటారు. గ్రామదేవతల పండుగ సందర్భాలలో స్త్రీలు సాంప్రదాయకంగా దుస్తుల ధరించి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.
సేకరణ: ప్రఖ్యాత చరిత్రకారుడు కె.ఎన్. సింగ్ రచించిన ‘పీపుల్ ఆఫ్ ఇండియా’ గ్రంథం ఆధారంగా ముదిరాజుల చరిత్ర






