11 May, 2026 | 6:26 AM

సైబర్ నేరాలకు అడ్డుకట్ట ఎన్నడు?

09-05-2024 12:05 AM

గడప రఘుపతిరావు :

హలో సార్.. మా కంపెనీలో పెట్టుబడి పెట్టండి, మీ డబ్బు లు రెట్టింపు అవుతాయి.. మాలక్కీ డ్రా లో మీరు కోటి రూపాయలు గెలుచుకున్నారు, కానీ  కొంచెం టాక్స్ కట్టాలి డబ్బులు పంపించండి. మీ లక్కీ ప్రైజ్ మనీని మీకు పంపిస్తాం ఛార్జీలు మీరు భరించాలి కొంత రుసుము పంపండి.... ఇలాంటి మాటలు నిజమని నమ్మి నేరగాళ్ల వలలో చిక్కి ఉన్నది పోగొట్టుకుని బంధువులకు, మిత్రులకు చెప్పలేక అప్పుల ఊబిలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయిన వారు కొందరైతే.... ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు మరికొందరు. ‘మీరు ఫలానా కంపెనీలో లక్కీ కస్టమర్. హైదరాబాద్ నగరంలో విల్లా గెలుచుకున్నారు. పదిశాతం చెల్లిస్తే, మా కంపెనీ ప్రతినిధి వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు’ అనగానే ఎగిరి గంతేసి ఛార్జీ లు చెల్లించి చివరకు మోసపోయామని లబోదిబో అన్నవారు ఆలోచించాలి...

బ్యాంకు ఖాతాలు టార్గెట్‌గా..

ఆన్‌లైన్ లావాదేవీల పెరుగుదలతో సైబర్ నేరాలు సైతం అదే స్థాయిలో పెరిగి పోతున్నాయి. సులభంగా డబ్బు కొట్టేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకొంటున్నారు. మీ కేవైసీ వివరాల ను అప్‌డేట్ చేస్తున్నామని నటిస్తూ ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలను అడగడం, దానితో ఫోన్ చేసింది బ్యాంకు వాళ్లేనేమోనని నమ్మి వివరాలు చెప్పేయడం జరు గుతోంది. బ్యాంకర్లు,  ఇన్సూరెన్స్ ఏజం ట్లు, హెల్త్ కేర్, లేదా ప్రభుత్వ అధికారుల పేరుతో బ్యాంకు వినియోగదారులకు ఫోన్లు చేస్తున్నారు. ఒక వేళ మనం ఆ వివరాలు చెప్తే క్షణాల్లో మన బ్యాంకు ఖాతా లో ఉన్న మొత్తాన్ని ఊడ్చేస్తారు. ఎవరు కూడా నిత్యం బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు చూస్తూ ఉండరు కదా!  ఎప్పుడో ఒకటి రెండు రోజుల తర్వాత చూసి ఖాతాలో మొత్తం సొమ్ము కొట్టేసిన విషయ గ్రహించి లబోదిబోమంటూ  సైబ ర్ క్రైమ్స్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేసినా అప్పటికే నేరగాళ్లు తమ ఫోన్లను స్విచాఫ్ చేసి ఉండడంతో పట్టుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. 

పిన్, లేదా ఓటీపీని షేర్ చేయవద్దు

కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాలోని డబ్బును డ్రా చేయడానికి పిన్ లేదా, ఓటీపీ ద్వారా ప్రామాణీకరించాల్సిన అవసరం లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఓటీపీ లేదా పిన్ షేర్ చేయ డం కోసం  వచ్చే అలాంటి అభ్యర్థనను స్వీకరించినట్లయితే వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అలాగే  మీ బ్యాంక్ లేదా ఇతర సంస్థ ఎప్పుడూ మీ రహస్య సమాచారాన్ని అడగదనే విషయన్ని గుర్తుంచుకోండి. అలాగే మీరు మునుపెన్నడూ చూడని ఆఫర్‌లను, వాగ్దా నం తెలియజేసే తెలియని లింక్‌లపై క్లిక్ చేస్తే  మీరు ఫిషింగ్  వైబ్‌సైట్లకు వెళతారు. అప్పుడు మిమ్మల్ని మోసం చేసే ప్రమా దం ఎక్కువగా ఉంటుంది. మోసగాళ్లు తరచూ కస్టమర్లకు తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లను  ఇస్తారు, కస్టమర్లు తమబ్యాంక్  లేదా ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన అధీకృత ప్రతినిధితో మాట్లాడుతున్నామని  నమ్మించేలా వారిని మోసం చేస్తారు. కాబ ట్టి బ్యాంకు లేదా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించడం ద్వా రా ఈ నంబర్లను ధ్రువీకరించుకోవడం మంచిది.

ఇక పెళ్లి కాని యువతులను వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయం చేసుకోవడం, తాను విదేశాల్లో మంచి ఉద్యోగంలో ఉన్నానని నమ్మించి మోసాలు చేసే వాళ్లూ ఇటీవలి కాలంలో ఎక్కువయ్యారు. సాన్నిహిత్యం పెరిగాక, తాను త్వరలోనే ఇండి యా వస్తున్నానని నమ్మబుకుతారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఫోన్ చేసి ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ వాళ్లు తాను తెస్తు న్న వస్తువులను పట్టుకున్నారని, వాటిని విడిపించడానికి  డబ్బు చెల్లించాల్సి ఉందని, తాను రాగానే తిరిగి ఇచ్చేస్తానంటూ నమ్మిస్తారు. ఆ మాటలు నమ్మిన యువతులు అతను చెప్పిన ఖాతాకు లక్షల రూపాయలు పంపించడం, ఆ వెంటనే అతను ఆ ఖాతా మూసేసి పరారవడం జరుగుతోంది. 

ఇలా అంతర్జాలం(ఇంటర్నెట్) వేదికగా ఎన్నో రకాల అక్రమాలకు అడ్డ్డాగా మారుతున్న సైబర్ మోసాలు నగరాలనుంచి  పల్లెల వరకు చేరాయి. ఇటీవల అనేక అం తర్జాల మోసాలు పల్లెల్లో కూడా బయట పడుతున్నాయి. ఆశ అనే బలహీనతను సాకుఆ చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులతో ఆడుకుంటున్నారు. లక్షలు, కోట్లు కొట్టేస్తున్నారు. పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు బయటపడడంలేదు, ఫిర్యాదులూ చేయడం లేదు. దీనివల్ల మరికొంతమంది మోసపోతున్నారు. ఇలా గత కొన్ని సంవత్సరా లుగా మోసాలు జరుగుతున్నా అవగాహన లేని వ్యక్తులు నష్టపోతూనే ఉన్నారు.

తియ్యటి మాటలతో మోసం

అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి తియ్యగా మాట్లాడి తమకంపెనీలో పెట్టుబడి పెట్టమని కోరడంతో కొందరు దురాశకు వెళ్లి, అడిగిందే తడవుగా ఆ వ్యక్తి చెప్పిన అకౌం ట్‌కు డబ్బులు పంపించడం, మొదట కొంత లాభం రావడంతో నమ్మి, అప్పు తెచ్చి, మోసగాడు చెప్పిన అకౌంట్ కు మరిన్ని డబ్బులు పంపిస్త్తూ లాభం ఆశతో నష్టపోయి మోసగాడి బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికంగా నష్టపో యి, ఎంతో శ్రమించి సంపాదించిన ఆస్తులను సైతం పోగొట్టుకుని రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.

ఉద్యోగులు, విద్యార్థులే కాకుండా రాజకీయ నాయకులు  కూడా సైబర్ మోసం నుండి తప్పించుకోలేక పోతున్నారు. తక్కు వ రోజుల్లో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మి ఇన్వెస్ట్ చేసి మోసపోయిన సంఘటనలు, లక్కీ డ్రా వచ్చిందంటూ  మెసేజ్ రావడంతో వాటిని నమ్మి కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ నగరాలకు  వెళ్లి మరికొంత డబ్బులు కట్టి చొప్పున కట్టి ఆ కంపెనీ బోర్డు తిప్పడంతో భారీగా నష్టపోయిన సంఘటనలు కూడ చాలా చోటు చేసుకున్నాయి. అంతర్జాల మోసాలకు అంతే లేకుండా పోయింది.

ఫేస్‌బుక్ సైతం..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్క్ లో ఒకటి ఫేస్ బుక్. సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా కూడా  ఫేస్‌బుక్ నిలుస్తోంది. ఫేస్‌బుక్ ను అడ్డం పెట్టుకుని చేసే నేరాలలో అకౌంట్లను హ్యాక్ చేయడం, డబ్బును డిమాండ్ చేయడం, వివరాలను దొంగిలించడం, భావోద్వేగాలతో ఆడుకోవడం, షాపింగ్ మోసం, ఫేక్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు,అత్యవసరంగా డబ్బులు అవసరం అనే వాటితో మోసా లు వంటివెన్నో జరుగుతున్నాయి. ఈ రోజుల్లో సోషల్ నెట్‌వర్క్ ద్వారా భారీ సంఖ్యలో వ్యక్తులు కనెక్ట్ అయిఉండడం గమనించిన సైబర్ నేరగాళ్లు ‘అందినకాడికి దోచుకుందాం’ అనే రీతిలో మోసా లకు పాల్పడుతున్నారు. ఫేప్‌బుక్ హ్యాకిం గ్, నకిలీ ప్రొఫైల్ సృష్టించి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి వివిధ కారణాలతో వేర్వేరు వ్యక్తులను సంప్రదించి, డబ్బు సంపాదించడా నికి ప్రయత్నిస్తారు. ప్రొఫైల్ యజమాని ఈ విషయాన్ని తెలుసుకొని, ఈ వార్తను అందరికీ తెలియజేసేవరకు అతని ప్రొఫైల్ హైజాక్ అయ్యిందని తెలియదు. ఇది ఫేస్‌బుక్ చీటిం గ్ స్కామ్‌కు సంబంధించిన కేసు అని ఆలస్యంగా తెలుసుకుంటారు. ఇలా కొంతమంది డబ్బుపోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు.

సోషల్ మీడియాలో జరిగే ఆర్థిక మోసాలకు అడ్డు కట్టపడడం లేదని, మనదేశంలో సైబర్ నేరాలకు శిక్షలు కఠినంగా లేకపోవడంతో సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరుగు తున్నాయని,సైబర్ క్రైమ్ చట్టాలలో మార్పు, తీసుకువచ్చి మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, పోలీసులు శాఖ ప్రత్యేక నిఘా విభాగాలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల  ఇలాంటి మోసాలను కట్టడి చెయ్యవచ్చనీ గ్రహించాలి.

- వ్యాసకర్త సెల్: 9963499282