23 August, 2026 | 8:46 PM

ఉషోదయ పీపుల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మేయర్ గణేష్

23-08-2026 07:57 PM

నిర్వాహకులను అభినందించిన నయీమ్ ఖురేషి..

కొత్తగూడెం ,ఆగస్టు 23.(విజయక్రాంతి): మహిళల చిరు వ్యాపారాలు తన ఇంటి జీవనానికే కాకుండా సమాజానికి సైతం మేలు చేసే విధంగా ఉపయోగపడతాయని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అన్నారు. చిరు వ్యాపారస్తులను మహిళలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఉషోదయ సంస్థ నిర్వహించినటువంటి పీపుల్స్ ఎగ్జిబిషన్ ను ఆదివారం ఉదయం కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ,రాష్ట్ర మైనారిటీ నాయకులు ఉర్దూగర్ చైర్మన్ డాక్టర్ నయీమ్ ఖురేషి ప్రారంభించారు. 

షాపింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం ప్రతిష్టాలను తిరుగుతూ వ్యాపారస్తులను పరిచయం చేసుకొని వారితో ముచ్చటించారు. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి దూరప్రాంతాల నుండి కొత్తగూడెం ఉర్దూగర్ ఫంక్షన్ హాల్లో జరిగే పీపుల్స్ ఎగ్జిబిషన్  వరకు రావడం నిజంగా అభినందనీయమని రాష్ట్ర మైనారిటీ నాయకులు ఉర్దూగర్ చైర్మన్ డాక్టర్ నయీమ్ ఖురేషి అన్నారు. ఉర్దూగర్లో ఇటువంటి చిన్న వ్యాపారస్తులను ప్రోత్సహించే స్టాల్స్ ను ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వాహకులను డాక్టర్ నయీమ్ ఖురేషి, ప్రముఖ రియల్టర్ ఖలీల్ అభినందించారు.

ఈ ఎగ్జిబిషన్ సందర్శించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక లక్కీ డిప్, లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం ఉండడంతో సందర్శకులు సైతం బహుమతులు అందుకున్నారు. అంతేకాకుండా ఈ ఎగ్జిబిషన్లో వ్యాపారాలు నిర్వహించే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన బహుమతులతో సందర్శకులను ఆకర్షించారు ఈ పీపుల్స్ ఎగ్జిబిషన్లో ముఖ్యంగా ఇమిటేషన్ జ్యువెలరీ, చీరలు, చిన్నపిల్లల డ్రస్సులు, ఫ్యాషన్ మెన్స్ వేర్లు, రాఖీ స్టాల్స్, ఆయుర్వేద ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, టాయ్స్ లెదర్ ప్రొడక్ట్స్ ఇంకా అనేక రకాల గేమ్స్ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి,

ప్రత్యేకంగా సోలార్, స్టీల్ డోర్స్ కు సంబంధించిన స్టాల్స్ సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి  ఈ ఎగ్జిబిషన్లో అందరూ మహిళా వ్యాపారస్తులే కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఉషోదయ సంస్థ నిర్వాహకులు ఇమంది ఉదయ్ కుమార్ కృష్ణవేణి మాడెం వేణుగోపాల్ వసుధ, ఇమంది గణేష్ ఇమంది హరికృష్ణ సుష్మ రాజ్ భరత్ లక్ష్మి, తరుణ్, సమీర్, హర్ష, భాను, సాయి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.