calender_icon.png 20 January, 2026 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ప్రమాదంతో పాడి గేద మృతి.. నష్టపరిహారం అందజేత

20-01-2026 07:52:14 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో పాడి గేద మృతి చెందింది. ఈ ఘటనలో నష్టపోయిన రైతు బూడిది నరసయ్యకు ప్రభుత్వం తరఫున సెస్ చైర్మన్ చిక్కాల రామారావు రూ.40 వేల నష్టపరిహార చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి అనుకోని నష్టాలు జరిగినా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే విద్యుత్ ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.