సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలి: సీఐటీయూ
మంచిర్యాల, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలని, జేఏసీతో మాట్లాడి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ కోరారు. గురువారం సీఐటీయు ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ బస్టాండ్ ఎదుట నిరసన చేపట్టారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల అవసరాల మేరకు ఆర్టీసి బస్సులు పెంచి దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెరుగుతుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశించాం, కానీ తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల విధానంలో మార్పుచేసి జిసిసి పద్ధతిని రద్దు చేయాలన్నారు.
ప్రభుత్వం సమ్మె చేస్తున్న జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సంకె రవి, జిల్లా సహాయ కార్యదర్శి సాంబారి వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు గోమాస ప్రకాష్, మండల కన్వీనర్ పసుల తిరుపతి, చిందం వెంకటేష్, చిప్పకుర్తి కుమార్, బానేష్ తదితరులు పాల్గొన్నారు.






