19 May, 2026 | 8:44 PM

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

20-06-2024 12:05 AM
  • బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, జూన్ 19: వానకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ యం త్రాంగం చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధికారులకు సూచించారు. బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో  నిర్వహించిన మున్సిపల్  సాధారాణ సమావేశానికి ఆయన హాజరయ్యారు. పట్టణంలోని 34 వార్డుల్లో దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చూడాలని సూచించారు. మున్సిపల్ వార్డుల్లో దోమ ల నివారణ కోసం నాలుగు స్ప్రే మిషన్లు, మురుగు కాల్వల్లో చల్లే లైమ్ పౌడర్ కొనుగోలుకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు.