మా వాళ్లను బలవంతంగా చేర్చుకుంటే కోర్టుకు వెళ్తాం..
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
రామాయంపేట, మార్చి 27 : రామాయంపేట 2వ వార్డు బి.ఆర్.ఎస్ కౌన్సిలర్ కొక్కు ప్రవీణ్ 24 గంటల్లో రెండు పార్టీలు మార్చాడు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి గెలిచిన ప్రవీణ్..గురువారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అయితే అది జరిగిన ఒక్క రోజులోనే శుక్రవారం తిరిగి సొంతగూటికి చేరాడు. హస్తం పార్టీ వీడి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో రామాయంపేట కార్యాలయంలో మళ్లీ గులాబీ పార్టీకి దగ్గరయ్యాడు.
మా వాళ్లను మభ్యపెట్టి బలవంతంగా కాంగ్రెస్లోకి చేర్చుకుంటున్నారు. మాయ మాటలతో మోసగించే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వారిని భయభ్రాంతులకు లోన్ చేసి కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని పద్మా దేవేందర్ రెడ్డి, తిరుపతిరెడ్డి లు ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్. చౌదరి సుప్రభాత్ రావు. కౌన్సిలర్లు చౌదరి చరిత. మద్దెల మాధవి రమేష్. టిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




