29 April, 2026 | 3:25 AM

బాల్యవివాహాలు రహిత జిల్లాగా మెదక్‌ను తీర్చిదిద్దాలి

29-04-2026 01:24 AM

అదనపు కలెక్టర్ నగేష్

మెదక్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహం బతుకు ఆగం అనే నినాదంతో రాందాస్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాల్య వివాహాన్ని ఆపి ఆరోగ్యకరమైన, విద్యావంతమైన సురక్షిత సమాజాన్ని నిర్మించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్  సూచించారు. బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక చట్టాలు హక్కులు తీసుకువచ్చిందని వాటిని సద్వినిగం చేసుకోవాలని కోరారు అనంతరం బాల్యవివాహాలను రద్దు చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన కల్పించాలని   బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, డీఎఫ్.ఓ జోజి, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డీఈఓ విజయ, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్ ఇతర శాఖల జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు, వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.