calender_icon.png 16 August, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి విషయంలో సహకారమందిస్తా

14-08-2025 12:14:29 PM

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసం నిరంతరం ప్రశ్నిస్తా..

జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి.. 

ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గ(Kalwakurthy Constituency) అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తాను కానీ.... గత అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు ప్రభుత్వం అమలు చేసే వరకు తాను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటానని జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యుడు(Former member of the National BC Commission) తల్లోజు ఆచారి పేర్కొన్నారు. గురువారం విజయ క్రాంతి(Vijaya Kranthi)తో మాట్లాడారు. ఎన్నికల ముందు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్ లను రూ, 2000 నుంచి 4000 వేలకు వికలాంగులకు 6 వేలకు పెంచుతామని చెప్పి 20 నెలలు గడుస్తున్న పెంచకపోవడంపై నిరసన కార్యక్రమంలో భాగంగా  ప్రజాస్వామ్యబద్ధంగా తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా ధర్నా చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి   20 నెలల్లో ఏనాడైనా కేంద్ర మంత్రులను కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్క లెటర్ అయినా  ఇచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు.

పార్టీ పరంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో   ప్రధానంగా నాలుగు మండలాలు కడ్తాల,అమనగల్లు, మాడుగుల తలకొండపల్లి లో ప్రధానంగా రోడ్ల సమస్యలను లేవనెత్తినట్లు చెప్పారు. జంగారెడ్డిపల్లి నుంచి చంద్రాయన పల్లి, కర్కల్ పహాడ్ నుంచి నాగిళ్ల వరకు, సింగంపల్లి ముదివేను వరకు రోడ్లు నిర్మాణం కు  నిధులు మంజూరు చేయించి మరమ్మతులు చేయాలని కోరగా పట్టింపు లేదని ఆయన విమర్శించారు.  హైదరాబాద్, శ్రీశైలం 765 జాతీయ రహదారిని ఆరు లైన్లుగా మంజూరు విషయంలో ఎమ్మెల్యేకు అవగాహన లేదని  ఆ రోడ్డు సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్  నిర్మాణాలు ఉన్నాయని అట్టి పైప్ లైన్ తొలగించి కేంద్ర ప్రభుత్వానికి అట్టి భూమిని అప్పచెపితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకమైన జల్ నల్ పథకం కింద ఆమనగల్లు మున్సిపాలిటీ ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ. 32 కోట్లు మంజూరు అయితే కేంద్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్సీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా  శంకుస్థాపనలు చేయడం ఎమ్మెల్యేకు తగదని ఆచారి హితవు పలికారు.  ఎన్నికలప్పుడే తాను రాజకీయాలు చేస్తానని అభివృద్ధి విషయంలో తాను సహకరిస్తానని ఆచారి చెప్పుకొచ్చారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం, సురసముద్రం చెరువును మినీ ట్యాంక్బండ్ నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్, ఏర్పాటుకు ఎవరు అడ్డుకుంటున్నారని  అభివృద్ధి విషయంలో ఏనాడైనా తనను సంప్రదించారా అంటూ ఆచారి  సూటిగా ప్రశ్నలు సంధించారు. మీడియా సమావేశంలో  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ జెడ్పిటిసి కండె హరిప్రసాద్, తాలూకా కో కన్వీనర్ గోరేటి నరసింహ, నాగర్ కర్నూల్ కౌన్సిల్ మెంబర్ చెక్కల లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ చెన్నకేశవులు, బిజెపి నాయకులు శ్రీకాంత్ సింగ్, మహేష్, రవి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.