14-08-2025 11:49:41 AM
కోయిలకొండ: కోయిల్ సాగర్ ప్రాజెక్టు(Koil Sagar Project)కు ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుల కారణంగా ఒక్కసారిగా కోయిల్ సాగర్(Koilsagar) పూర్తిస్థాయి నీటిమట్టం చేరింది. దీంతో సంబంధిత అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని అంచనాలు వేసి పూర్తిస్థాయి నీటిమట్టం రావడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. గత రెండు రోజులుగా కూడా కోయిల్ సాగర్ గేట్లు ఎత్తివేయడం జరుగుతుందని ముందస్తుగా సమాచారం ఇవ్వడంతో లోతట్టు ప్రాంతాలకు సమాచారం చేరవేశారు. ఈ నేపథ్యంలోనే దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(Devarakadra MLA Madhusudhan Reddy) కోయిల్ సాగర్ ప్రాజెక్టు నీరు విడుదల చేయడం జరుగుతుందని ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని సూచనలు చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు మీరు కూడా వరద మరింతగా పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తి దిగువకు నీరు వదిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.