calender_icon.png 14 August, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతుల ఆందోళన

14-08-2025 11:46:27 AM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): భీమిని మండలం వెంకటాపూర్ గ్రామంలో గురువారం యూరియా కోసం రైతన్నలు ఆందోళన చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడం లేదంటూ వెంకటాపూర్ గ్రామంలోని(Venkatapur Village) జై భీమ్ పరస్పర సహకార మార్కెటింగ్ సంఘం ముందు గంటసేపు ఆందోళనకు దిగారు. సహకార మార్కెటింగ్ సంఘం ద్వారా 266 యూరియా బస్తాలు వస్తే కనీసం ఒక బస్తా కూడా పంపిణీ చేయలేదని రైతులు మండిపడ్డారు.

సంఘం అనుబంధ శ్రీరామ్ ట్రేడర్స్ లో 160 యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వారు ఆరోపించారు. మిగతా 106 యూరియా బస్తాలు ఎవరికి పంపిణీ చేశారో తెల పాలంటూ సొసైటీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్లు బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తాలను అమ్ముకుంటున్నారని రైతులు సహకార సంఘం ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తాలను అమ్ముకుంటున్న డీలర్ల పై చర్యలు తీసుకొని రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ జరిగేలా చూడాలని కోరారు.