calender_icon.png 14 August, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు గ్రామాలు.. 7 ఇండ్లలో దొంగలు పడ్డారు

14-08-2025 11:44:05 AM

  1. ఏ ఇంటిలో ఏమి చోరీ అయ్యాయో దర్యాప్తు 
  2. మహమ్మదాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి 

గండీడ్: మహబూబ్​నగర్(Mahabubnagar) జిల్లాలోని గండీడ్ మండల పరిధిలో(Gandeed Mandal Area) నాలుగు గ్రామాలలో ఏడు ఇండ్లలో దొంగలు పడిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గండీడ్ మండల కేంద్రంలో ఒక ఇల్లు, రెడ్డిపల్లి గ్రామంలో గాజుల కృష్ణయ్య, బలిజ మల్లప్ప, అవుసుల జగదీష్ ఇండ్లలో జోలికి గురి కావడంతో పాటు రంగారెడ్డిపల్లి లో ఒక ఇంటి లో అర్ధరాత్రి దొంగలు పడ్డట్లు ఆ ఇంటి యజమానులు, గ్రామస్తులు తెలిపారు.

ఆ ఇండ్లలో ఏమేమి వస్తువులు పోయాయో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, ఇంటిలో ఎవరు లేని ఇండ్లనే టార్గెట్ గా చేసుకొని వర్షం కురుస్తున్న బయటికి ఎవరు రాకపోవడంతో ఇతరులు దొంగతనాలు చేయడం జరిగిందా ? స్థానికులు చేశారని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శేఖర్ రెడ్డి(SI Shekar Reddy) తెలియజేశారు. వర్షం ఏకదాటిగా కురవడంతో ఇండ్లలో నుంచి ఎవరు బయటికి రాకపోవడంతో ఎవరూ లేని ఇండ్లను టార్గెట్గా చేసుకున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం తెలియవలసి ఉంది.  ఎస్సై శేఖర్ రెడ్డి గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి