calender_icon.png 27 January, 2026 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యానికి మీడియా మూల స్తంభం

05-08-2024 01:39:10 AM

ఐజేయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో గవర్నర్ దత్తాత్రేయ

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యానికి మీడియా మూల స్థంభమని హర్యానా గవర్నర్ బండారు దత్తా త్రేయ పేర్కొన్నారు. ప్రభుత్వాలు చేసే మం చి, చెడును ప్రజలకు వివరించే బాధ్యత మీడియాపైనే ఉందని చెప్పారు. హర్యానాలోని పంచకులలో రెండు రోజులపాటు జరిగిన ఐజేయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

వర్కింగ్ జర్నలి స్టులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వేజ్ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతపై కేంద్రం దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. సమావేశంలో ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఎస్‌ఎన్ సిన్హా, కార్యదర్శి బల్వీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.