calender_icon.png 27 January, 2026 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ వచ్చినా పదేండ్లలో సమస్యలు తీరలేదు

27-01-2026 01:11:42 PM

సరైన విద్య అందితేనే.. పేదల సమస్యలు తొలగుతాయి

బొట్టుగూడ పాఠశాలను ఒక మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దాం

ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలను సర్కార్ స్కూల్ కి పంపాలి

గత సీఎం కలవనీయలేదు.. నిధులివ్వలేదు

హైదరాబాద్: నల్గొండలోని బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ప్రారంభించారు. అనంతం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ వచ్చినా తొలి పదేళ్లలో మన సమస్యలు తీరలేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తొలగుతాయని ఆయన సూచించారు. విద్యపై ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చు పెడుతోందని చెప్పారు. నల్గొండలోని బొట్టుగూడ పాఠశాలను ఒక మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దామని మంత్రి హామీ ఇచ్చారు. బొట్టుగూడ స్కూల్ వంటి ప్రభుత్వ పాఠశాల దేశం మొత్తంలో మరెక్కడా కనిపించదన్నారు.

కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, క్రీడా సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. మన విద్యార్థులకు మార్కులు బాగున్నా.. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఉండటం లేదని వివరించారు. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకే స్కిల్ యూనివర్సిటీని సీఎం రేవంత్ ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కులం, మతం తేడా లేకుండా విద్యార్థులు చదువుకోవాలన్నది ఈ ప్రభుత్వ ఆశయం అన్నారు. నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్నానని గుర్తు చేశారు.

గత సీఎం కేసీఆర్ .. తనను కలవనీయలేదు.. నిధులు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు సీఎం అడిగి కావాల్సినన్ని నిధులు తీసుకువస్తున్నానని వెల్లడించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నల్గొండకు నిధులు రాలేదని ఆరోపించారు. కొడంగల్ కు ఇచ్చినన్ని నిధులు నల్గొండకూ ఇవ్వాలిని సీఎంను అడిగానని చెప్పారు. ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలి.. మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. హ్యామ్ రోడ్లకు రూ. 12 వేల కోట్లు కేటాయించామని వివరించారు.