calender_icon.png 4 September, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీ, సంక్షేమ బాలికల కళాశాలలో వైద్య శిబిరం

04-09-2025 05:21:26 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో మైనార్టీ గురుకులం, బాలికల సంక్షేమ గురుకుల కళాశాలలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి 15 మందిని జ్వర పీడితులుగా గుర్తించి ఆర్డి పరీక్షలు చేయగా ఎలాంటి పాజిటివ్ కేసులు నిర్ధారణ కాలేదు. చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్న 8 మంది, కంటి సమస్యతో బాధపడుతున్న ఇద్దరితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మరో 24 మందిని గుర్తించి మందులు అందించారు. అనంతరం కళాశాల గదిలలో దోమల మందులు పిచికారి చేశారు. ఈ కళాశాలలో మరో మూడు రోజులు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుచరిత, ఆర్.బి.ఎస్.కె సిబ్బంది, డి పి హెచ్ ఎన్ పద్మ, వైద్య సిబ్బంది , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాలతో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ తెలిపారు.