calender_icon.png 4 September, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత రుణమాఫీ వెంటనే అమలు చేయాలి

04-09-2025 05:19:27 PM

గుండు వెంకటనర్సు చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

నకిరేకల్ (విజయక్రాంతి): చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన చేనేత రుణమాఫీ వెంటనే అమలు చేసి, జియోట్యాగ్ కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏలాంటి షరతులు లేకుండా నేతన్న భరోసా వెంటనే అమలు చేయాలని చేనేత కార్మిక సంఘం(Handloom Workers Union) జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని పద్మశాలి కాలనిలో చేనేత కార్మికుల సమస్యలపై కార్మికులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేనేత రుణమాఫీ ప్రకటించి సంవత్సరం గడుస్తున్నా కార్మికులకు ఇంకా అందలేదన్నారు. నిధులు కూడ విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసిన ప్రభుత్వం, బ్యాంకుల నుండి డాక్యుమెట్లు సేకరించినప్పటికి కాలయాపన చేస్తుండటంతో ఎప్పుడు బ్యాంకు ఖాతల్లో డబ్బులు జమ చేస్తారోనని చేనేత కార్మికులు ఆశగా ఎదిరి చూస్తున్నారని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్  విడుదలైతే  ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉన్నందున వెంటనే రుణమాఫి అమలు చెయ్యాలనిఆయన  కోరారు. నేతన్న భరోసా  ఏలాంటి షరతులు లేకుండా జియోట్యాగ్ కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి వర్తింప చెయ్యాలని,  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు  చేనేత కార్మికుల పెంక్షన్ నాలుగు వేలకు పెంచి, ఇండ్లు లేని నిరుపేద చేనేత కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లలో  హౌజ్ కం వర్క్ షెడ్ నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్నిఆయన  డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో రామన్నపేట పద్మశాలి సంఘం అధ్యక్షులు  రచ్చ యాదగిరి , చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు గంజి అశోక్, గండూరి నరేష్, అందే పాండు, గంగుల మురళి, జెల్ల నరేందర్, తొర్ర రఘు , సూరపల్లి మధు, సూరపల్లి జగన్,తదితరులు పాల్గొన్నారు.