calender_icon.png 8 August, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటి వైద్య నిపుణులచే వైద్య శిబిరం

08-08-2025 01:50:39 AM

పెబ్బేరు ఆగస్టు 7 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా కంటి వైద్య నిపుణుడు రఘునందన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 48 మందికి పరీక్షలు నిర్వహించారు.

కంటి చూపు లేనివారిని 26మందిని గుర్తించారు. వారిని వనపర్తి జిల్లా జనరల్ ఆస్పత్రిలో కంటి శస్త్ర చికిత్స ద్వారా తిరిగి చూపు వచ్చేలా చేస్తామని స్థానిక వైద్యాధికారి డాక్టర్ ప్రవళిక తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ లీలమ్మ, అసిస్టెంట్ రాజశేఖర్, ఆపరేటర్ రాజేష్ గౌడ్, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.