calender_icon.png 8 August, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను నీకు రక్ష..! నీవు నాకు రక్ష...!

08-08-2025 01:49:59 AM

ఇటిక్యాల, ఆగస్టు 7: ఎర్రవల్లి మండల కేంద్రంలోని ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్  స్కూల్ నందు చిన్నారులతో ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి మధులిక గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూఈ రాఖీ కట్టే ఆచారం మొగల్ రాజుల కాలంలో స్త్రీల రక్షణ కోసం రాజపుత్రుడు చేసిన ఏర్పాటనీ కొందరు అంటారు. చిత్తౌడ్ మహారాణి కరుణావతి.

తన కోటను గుజరాత్ నవాబ్ అయిన బహదూ ్శ ముట్టడించగా తనను రక్షించమంటూ ఢిల్లీ చక్రవర్తి హుమాయు మాదిశాకు రక్షాబంధన్నిపంపి తమను రక్షించమని ప్రార్థించింది. అతడు ప్రార్థనను మన్నించి ఆమెను తన సోదరిగా భావించి బహదూర్షాను తరిమి వేశాడు. ఆ రోజు నుంచి ఈ ఆచారం మన దేశంలోకి చాలా ప్రాంతాలలో ప్రబళించింది. కాకతీయ రుద్రమదేవి సమకాలికుడైన యాదవ రాజు మహాదేవుని ఆస్థానంలో సమస్త కరుణాతిషుడైన హేమాద్రి పండితుడు వ్రత ఖండంలో దీన్ని పేర్కొనటం వల్ల ఈ రక్షాబంధన్ కి బహుళ ప్రచారం జరుగుతూ వస్తుంది అని క్లుప్తంగా వివరించారు.

  మన పాఠశాలలో ఈ చిన్నారులు జరుపుకుంటున్న రక్షాబంధన్ కూడా ఒకరికొకరు సోదరసోదరీ భావంతో కలిసి మెలిసి ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ చిన్నారులకు మరియు అధ్యాపక బృందానికి విద్యార్థులు తల్లిదండ్రులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ నందిని కేని మరియు అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు