calender_icon.png 8 August, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ సేవలు అభినందనీయం

08-08-2025 01:51:17 AM

జడ్చర్ల ఆగస్టు 7 : జడ్చర్ల ఆర్టిసి సేవలు అభినందనీయంగా ఉన్నాయని పలువురు ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం హారిక ప్యాసింజర్ వనపర్తి నుండి హైదరాబాద్ బస్సులో వెళుతుండగా హైదరాబాద్ చేరుకున్న తర్వాత ప్రయాణించిన బస్సులోనే ఫోను మర్చిపోయింది.  హారిక హైదరాబాదులో పటాన్ చెరువు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో  ఫోను కనిపించలేదు.

వనపర్తి బస్సులో ఫోన్ ఉన్నది కండక్టర్ వచ్చి జడ్చర్ల బస్ స్టాప్ లో డ్యూటీలో ఉన్న స్టేషన్ మేనేజర్: రవీంద్రనాథ్, ట్రాఫిక్ గైడ్: శివ రాముడు, సెక్యూరిటీ: లింగంపేట్ నర్సింలు ప్యాసింజర్ కు ఫోన్ ఇచ్చినారు. ప్రయాణికు రాలిన తిరిగి రప్పించి ఫోన్ ను ప్రయాణికురాలు హారిక కు అందించారు.