10 July, 2026 | 1:41 AM

జహీరాబాద్‌లో వైద్య శిబిరం

10-07-2026 12:35 AM

మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి: మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ ఆధ్వర్యంలో జహీరాబాద్‌లోని సిటీ సెంటర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నిర్వహించిన యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కాలేయ వ్యాధుల వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. శిబిరంలో డా. అవినాష్ గొట్టిముక్కల (కన్సల్టెంట్ యూరాల జిస్ట్, ఆండ్రాలజిస్ట్), డా. సబ్బు సూర్యప్రకాశ్ (కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్) రోగులను పరీక్షించి వైద్య సలహాలు, చికిత్స సూచనలు అందించారు.

కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలు, మూత్ర సంబంధిత వ్యాధులు, గ్యాస్, అజీర్ణం, ఫ్యాటీ లివర్, కామెర్లు, కాలే యం, ప్యాంక్రియాస్, పేగుల వ్యాధులతో బాధపడుతున్న పలువురు రోగులు ఈ శిబిరంలో నిపుణుల సేవలు పొందారు. ప్రజలకు నిపుణుల వైద్య సేవలను చేరువ చేయడానికి భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక కన్సల్టేషన్ క్యాంపులు నిర్వహిస్తామని మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం వెల్లడించింది.