6 May, 2026 | 7:58 PM

Breaking News

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •  

సేవాభావంతో వైద్యాన్ని అందించాలి

30-06-2025 01:32 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ జూన్ 29 (విజయ క్రాంతి) : ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవాభావంతో నాణ్యమైన వైద్యం అందించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని శెట్టి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మారుతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని, ఇక మహబూబ్ నగర్ ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, టి పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, అజ్మత్ అలి, నాయకులు శాంతన్న యాదవ్,ఎం.ప్రవీణ్ కుమార్ , పులిజాల రవికిరణ్, ఐఎంఎ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాంమోహన్, డాక్టర్ సామ్యూల్, మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.