13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

చిన్నారులకు వైద్య పరీక్షలు

27-03-2026 12:00 AM

మంచిర్యాల టౌన్, మార్చి 26: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆశ్రమాలను, బాలసదనాల్లో ఉన్న పిల్లలకు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాహితీ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.

వైద్య శిబిరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ లు సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్, డాక్టర్ రాము, డాక్టర్ రజిత, బాలసదనం అధికారి రంజిత, ఏకలవ్య ఫౌండేషన్ మేనేజర్ శ్రీనివాస్, గోపాల్ రావు, ఐసిడిఎస్ సత్తయ్య, డెమో బుక్క వెంకటేశ్వర్, ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రం సిహెచ్‌ఓ, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.