calender_icon.png 14 August, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

14-08-2025 08:29:33 AM

ఎంపీడీవో సత్తయ్య

కొండాపూర్: రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు(heavy rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో సత్తయ్య పంచాయతీ సెక్రెటరీలకు సూచించారు. బుధవారం కొండాపూర్ ఎంపీడీవో కార్యాలయాల్లో మండలంలోని గ్రామపంచాయతీ సెక్రటరీల సమావేశం ఎంపీఓ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో సత్తయ్య మాట్లాడుతూ... భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా పంచాయతీ అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని సూచించారు. ఎక్కడ కూడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం, మూగజీవాలు ప్రాణాలు కోల్పోకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటూ, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం యావత్తు అండగా ఉందనే భరోసాను ప్రజలకు కల్పించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో  గ్రామపంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.