01-07-2025 02:44:28 AM
-గేటెడ్ కమ్యూనిటీ ప్రజల కోసం ఏర్పాటు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్ ‘మెడికవర్ సహాయోగ్ ప్రోగ్రామ్‘ను చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ డెగ్లూర్కర్, సినీ నటులు అశోక్‌కుమార్, మహేష్ అంచట గారిచే సోమవారం ప్రారంభించారు. ఈ వినూత్న కార్యక్రమం గేటెడ్ కమ్యూనిటీలలో నివసించే ప్రజలకు వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణను నేరుగా అందించేందుకు రూపొందిం చబడింది.
‘మెడికవర్ సహాయోగ్’ అనేది ఆయా గేటెడ్ కమ్యూనిటీల నుంచి ఎంపిక చేయబడిన నమ్మకమైన నివాసి. వీరు మెడికవర్ హాస్పిటల్‌కు, వారి కమ్యూనిటీకి మధ్య వారధిగా వ్యవహరిస్తారు. వైద్యపరమైన స మాచారాన్ని అందిస్తారు, సీనియర్ డాక్టర్లు, అత్యవసర సేవలను నిర్ధారిస్తారు. ఆసుపత్రి అపాయింట్మెంట్లు, అడ్మిషన్లలో ప్రాధాన్యతను కల్పిస్తారు అని మెడకవర్ హాస్పిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ డెగ్లూర్కర్ తెలిపారు. మెడికవర్ ప్రత్యేక ఆఫర్లను కూడా తెలియజేస్తారు.