24-09-2025 08:33:20 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు వైద్యులు మన్విత, శ్రావణ్ తెలిపారు. ఈ సందర్భంగా స్నాపా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు రక్తనామానాలు సేకరించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వర్షాకాలం కావున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పౌష్టికాహారం తీసుకోవాలని పలు సలహాలు సూచనలు తెలిపారు.