24-09-2025 10:31:34 PM
గజ్వేల్: ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా బుధవారం విద్యా సరస్వతి అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు శ్రీ విద్యాధరి అమ్మవారికి విశేషాభిషేకం, గణపతి పూజ, సుప్రభాతం, గిరి ప్రదక్షణం, అలంకారం, పంచ హారతులు, చతుషష్టూ పచార పూజ, రాజోపచార పూజలు, చండీ హోమం తదితర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధాంతి చంద్రశేఖర శర్మ మాట్లాడుతూ... కరువు కాటకాదులు నెలకొన్న నేపథ్యంలో పరమశివుని సంతృప్తి పరచేందుకు పార్వతీదేవి శ్రీ అన్నపూర్ణగా అవతరించి మానవాళి ఆకలి తీర్చినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆలయ సభ మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.