calender_icon.png 24 September, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ ఉత్తమ బోధన అవార్డు గ్రహీత నక్క స్నేహలత యాదవ్

24-09-2025 08:38:29 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ గోకుల్ నగర్ ప్రాంతానికి చెందిన నక్క స్నేహలత  యాదవ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రిన్యూర్షిప్ విభాగంలో  జాతీయ ఉత్తమ టీచర్స్ అవార్డును అందుకున్నారు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా  ఢిల్లీలో నిర్వహించిన జాతీయ ఉత్తమ బోధన అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.

ఈ సందర్భంగా యాదవ పొదుపు, పరపతి పరస్పర సహాయక సహకార సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం బీసీ భవన్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుడా మాజీ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా యాదవ వెల్ఫేర్ ట్రస్ట్  చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ పాల్గొన్నారు. జాతీయ ఉత్తమ  టీచర్ అవార్డు గ్రహీత నక్క స్నేహలత యాదవ్ ని ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానం చేశారు.