24-09-2025 10:42:37 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): జుక్కల్ నియోజవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమైందని, అభివృద్ధి దిశగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. జుక్కల్ నియోజకవర్గానికి స్వయంగా వచ్చి పరిస్థితులను పరిశీలించాలని ఆహ్వానించారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించి, త్వరలోనే నియోజకవర్గాన్ని సందర్శిస్తానన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతేకాక, జుక్కల్ నియోజకవర్గానికి మూడు బిఎస్ఎన్ఎల్ టవర్స్ ను మంజూరు చేస్తానని ప్రకటించారు. ఇది జిల్లాలో టెలికాం కనెక్టివిటీ మెరుగుపరచడంలో కీలకంగా నిలవనుంది.జుక్కల్ అభివృద్ధికి తన యొక్క పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.