24-09-2025 08:29:31 PM
బచ్చన్నపేట,(విజయక్రాంతి): ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్న పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని ప్రజల భద్రతనే పోలీస్ బాధ్యత అని బచ్చన్నపేట మండల ఇన్చార్జి ఎస్ఐ చెన్నకేశవులు అన్నారు. బుధవారం యువతకు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత చెడు అలవాటు నేర్చుకోవద్దని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భవిష్యత్తులో అందరికీ ఆదర్శంగా ఉండే బాధ్యత నేటి యువతకే ఉన్నదన్నారు. ప్రజలు ప్రమాదకరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలని ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన నేరుగా పోలీస్ స్టేషన్ కి కాని 100 కానీ ఫోన్ చేస్తే మీ అందుబాటులో ఉండి న్యాయం చేస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ప్రజలు అందరూ సేవలు వినియోగించుకోవాలన్నారు.