24-09-2025 10:27:58 PM
- తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను ఏకతాటిపై తేవడమే లక్ష్యం
- ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగుదిండ్ల భాస్కర్
మునుగోడు,(విజయక్రాంతి): రాజకీయాలకు అతీతంగా సమాజసేవ చేయడమే లక్ష్యమని ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగు దిండ్ల భాస్కర్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో దసరా ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ తరునంలో ప్రజలకు జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా జిల్లా నలుమూలల నుండి సాంస్కృతిక సంప్రదాయ కళాకారులనుతో సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రాంత సంప్రదాయాలను ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కల్పించడం కొరకే ఈ వింతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వచ్చానని ఈ వినుతమైన కార్యక్రమానికి రాజకీయ రంగు ఉపయోగాన్ని సభాముఖంగా తెలియజేశారు. ఈనెల అక్టోబర్ 3న నిర్వహించే దసరా ఉత్సవాలను జిల్లా అను మూల నుండి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.