24-09-2025 10:18:10 PM
నిర్మల్,(విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి అరుణ గారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి దయానంద తెలిపారు. విదేశాలు విద్యను చదువుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని వారికి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుందన్నారు. అరులైన డిగ్రీ ఆపై విద్యారత ఉన్న విద్యార్థులు ఈనెల 23 నుంచి వచ్చే నెల 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కార్యాలయంలో గాని ప్రభుత్వ వెబ్సైట్లో గాని సంప్రదించాలని సూచించారు.