11-11-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 10 (విజయక్రాంతి): పదవ తేదీన ప్రజా వాగ్గేయకారుడు డాక్టర్ అందెశ్రీ అకాల మరణం పట్ల రంగవల్లి విజ్ఞాన కేంద్రం వేములవాడ ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తుంది. నవంబర్ 11, ఆయన అంత్యక్రియలు జరుగుతున్నందున రంగవల్లి 26వ వర్ధంతి సందర్భంగా వేములవాడలో జరిగే రంగవల్లి ప్రధమ వార్షికో త్సవ సభ నవంబర్ 13 కు వాయిదా వేస్తు న్నాం.
సంక్షోభ కాలం-సామాజిక మార్పు‘ అనే అంశంపై ప్రొఫెసర్ కొల్లాపురం విమల, ‘ప్రజా గ్రంథాలయాల ఆవశ్యకత‘ అనే అం శంపై జూ కంటే జగన్నాథం ల ప్రసంగాలు నవంబర్ 13, 2025న ఉదయం 10 గంటలకు యధావిధిగా ప్రారంభమవుతాయి.ఈ మార్పును గమనించి సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం.విమలక్క & పోకల సాయికుమార్ రంగవల్లి విజ్ఞాన కేంద్రంవేములవాడ.